శ్రీశైలం దేవస్థానం సమీపంలో ఉహించని ఘటన

శ్రీశైలం దేవస్థానం సమీపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. దేవస్థానికి సమీపంలో ఉన్న యాంఫి ధియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడటంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం బయట పడింది. దానిని చూసి వారంతా తొలుత షాక్ అయ్యారు. వెంటనే ఆ శివలింగాన్ని బయటకు తీశారు. అయితే శివలింగంతో పాటు తెలుగు లిపిలో ఉన్న శాసనం కూడా లభించింది. ఈ శాసనం 14-15 శతాబ్దాల కాలం నాటిదని అంచనా వేస్తున్నారు.

శివలింగంతో పాటు లభించిన తెలుగు లిపి శాసనంలోఏముందనే విషయాన్ని తెలుసుకునేందుకు శ్రీశైలం దేవస్థానం అధికారులు మైసూరుకు పంపించారు. అక్కడి ఆర్కియాలజీ అధికారులు లిపిలో ఏముందో గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగం, నంది విగ్రహాలను చక్ర గుండం వద్ద ప్రతిష్ఠించినట్లు లిపిలో ఉన్నట్టు వెల్లడించారు. బయటపడిన శివలింగాన్ని, తెలుగు లిపి శాసనాన్ని శ్రీశైలం దేవస్థానం అధికారులు పరిశీలించారు. మరి ఆ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్టిస్తారనేది తెలియాల్సి ఉంది.

Share this post with your friends