
శివలింగం ఎలా ఉద్భవించింది. దాని కథేంటి? శివ లింగాలు ఎన్ని రంగాలు? వంటి చాలా విషయాలు ఇప్పటికే తెలుసుకుపన్నాం. రఇప్పుడు మరికొన్ని విషయాలు శివలింగం గురించి తెలుసుకుందాం. ముందుగా శివలింగాలను ఎలా తయారు చేస్తారు? ఏ లింగాన్ని పూజిస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం. రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
రజోమయలింగం: పుప్పొతో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివసాయుజ్యాన్ని పొందగలం.
ధాన్యలింగం: యవుల, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
తిలపిష్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
లవణజలింగం : హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
తుషోత్థలింగం : మారణక్రియకు పూజిస్తారు.
భస్మమయలింగం : భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.
