తులసి మొక్కను పొరపాటున కూడా ఆ దిశలో పెట్టకూడదు.. కారణమేంటంటే..

తులసి మొక్క హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆరోగ్య పరంగా కూడా తులసికి గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో అత్యంత కీలకంగా భావిస్తారు. హిందువులు తమ ఇంట తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుతారు. ఉదయాన్నే తులశమ్మను పూజించుకున్న తర్వాతే ఏ పనైనా చేస్తారు. తులసి మొక్కను మంచిగా చూసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. లేదంటే ఇబ్బంది తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇంట్లో తులసి మొక్క పచ్చగా, ఆరోగ్యంగా ఉంటే కుటుంబ సభ్యులు సైతం సుఖసంతోషాలతో.. ఎలాంటి సమస్యలూ లేకుండా ఉంటారని నమ్మకం.

తులసి మొక్కను ఎక్కడ పెట్టాలో కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇంటి ముందు వైపున, మధ్యలో లేదా ఉత్తర, ఈశాన్య దిశలో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కొందరు తులసి మొక్కను బాల్కనీలో లేదా కిటికీ దగ్గర పెంచుతారు. అలాంటి వారు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా భావిస్తారు. ఈ దిశలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో సౌభాగ్యం ఉండదు సరికదా.. లక్ష్మీ కటాక్షం కూడా కరువవుతుందట. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వంటగదికి వెలుపల తులసి మొక్క ఉంచితే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు.

Share this post with your friends