శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆగస్ట్ 12వ తేదీ సోమవారం నుండి వెంటనే అమలులోకి వస్తుంది.
టీటీడీ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ తెలిపిన విధంగా, ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్డులో తరచుగా రోడ్లు దాటుతున్నాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి, సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను మొదటి మరియు రెండవ ఘాట్ రోడ్‌లలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కావున భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది.