భగవంతుడి కోసం ఏమైనా ఇవ్వాలంటే దానిని స్వచ్ఛంగా.. శుచిగా ఉంటేనే సమర్పిస్తూ ఉంటాం. అలాంటిది డబ్బు తీసుకుని సప్లై చేస్తున్నప్పుడు మరెంత జాగ్రత్త వహించాలి? అవన్నీ తిరుమలలో పెద్దగా కనిపించవు. స్వామివారి దేవస్థానాని ఓ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తోంది. విషయాన్ని గ్రహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే.శ్యామలరావు సదరు సంస్థపై చర్యలు తీసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న గుత్తేదారు సంస్థపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఏఆర్ డెయిరీ డెవలప్‌మెంట్ అనే సంస్థ నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తోంది. విషయం ఈవో దృష్టికి వెళ్లడంతో వెంటనే సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించినా గుత్తేదారు పట్టించుకోలేదని తెలుస్తోంది. నెయ్యిని పరీక్షకు పంపడంతో ఇతర నూనెలు కల్తీ చేసినట్లు ఫలితాలు వచ్చాయి. నెయ్యి కల్తీని గుర్తించడంతో సరఫరాదారుకు టీటీడీ షోకాజ్ నోటీసులు అందజేసింది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థను టీటీడీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. టీటీడీకి 8.05 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలా ఏఆర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకూ 60 వేల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. సరఫరా చేసిన నెయ్యిలో 20 వేల కిలోల నెయ్యి నాణ్యత లేదని టీటీడీ తిప్పి పంపించివేసింది. ఆపై సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. మొత్తానికి గోవిందునికే నామాలు పెట్టింది ఈ సంస్థం.