టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం.. ఇక అన్నీ పారదర్శకమే..

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా జే శ్యామలరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. సాధారణ భక్తులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగష్ట్ 7 వ తేది నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలను అందరికీ తెలిసేలా టీటీడీ వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఏవైనా సరే.. పారదర్శకంగా భక్తులు ముందు ఉంచాలని ఈవో నిర్ణయించారు.

ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో రిటైర్‌మెంట్ పర్వం నడుస్తోంది. ఇవాళ టీటీడీలో ఒకే రోజు పెద్ద ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 113 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వీరిలో అన్ని కేటగిరీల ఉద్యోగులూ ఉన్నారు. ఇద్దరు డిప్యూటి ఈఓ స్థాయి ఉద్యోగులతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకూ అందరూ ఉన్నారు. వీరి పదవీ విరణమణతో ఒక్కసారిగా డిప్యూటీ ఈఓ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు సంబంధించిన వివాదం ఇంకా ఓ దరి చేరలేదు. దీంతో ప్రమోషన్ల పర్వాన్ని టీటీడీ అధికారులు పెండింగ్‌లో ఉంచారు.

Share this post with your friends