తోటకాష్టకం (Totakashtakam)

విదితాఖిల శాస్త్ర సుధాజలధే
మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||

కరుణా వరుణాలయ పాలయ మాం
భవసాగర దుఃఖ విదూన హృదమ్
రచయాఖిల దర్శన తత్త్వవిదం
భవ శంకరదేశిక మే శరణమ్ || 2 ||

భవతా జనతా సుహితా భవితా
నిజబోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవ వివేక విదం
భవ శంకరదేశిక మే శరణమ్ || ౩ ||

భవ యేవ భవానితి మే నితరాం
సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహ మహాజలధిం
భవ శంకరదేశిక మే శరణమ్ || 4 ||

సుకృతేధికృతే బహుధా భవతో
భవితా సమదర్శన లాలసతా
అతి దీనమిమం పరిపాలయ మాం
భవ శంకరదేశిక మే శరణమ్ || 5 ||

జగతీమవితుం కలితాకృతయో
విచరంతి మహామాహ సచ్చలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||

గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం న హి కోపి సుధీః
శరణాగత వత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||

విదితా న మయా విశదైక కలా
న చ కించన కాంచనమస్తి గురో
ధృతమేవ విదేహి కృపాం సహజాం
భవ శంకరదేశిక మే శరణమ్ || 8 ||

గురువు సమదర్శనుడై ఉండాలి. అతిదీనులను సైతం ఉద్ధరించేలా ఆయన బోధలు సాగాలి. బోధలోనే కాకుండా హృదయంలోనూ, ఆచరణలోనూ కూడా విశుద్ధ వర్తనుడై ఉండాలి. అటువంటి గురువు అఖిల శాస్త్రాలను తనలో నింపుకున్న కరుణా సముద్రుడు కూడా అయితే శిష్యునికి ఆయన సన్నిధిలో సమస్తమూ లభ్యమవుతుంది. గురువు గొప్పతనాన్ని అత్యద్భుత రీతిలో వర్ణించిన ఈ అష్టకాన్ని ఆదిశంకరుల శిష్యుడైన తోటకాచార్యులు రచించారు. గురుపూర్ణిమ సందర్భంగా తోటకాష్టకాన్ని తప్పకుండా పఠించాలని పెద్దలు చెబుతారు.

Share this post with your friends