రేపే గాయత్రీ మాత జయంతి.. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించారో..

జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజునే గాయత్రీ మాత జయంతిని జరుపుకుంటూ ఉంటాం. ఇలా చూసుకుంటే రేపే గాయత్రీ జయంతి. రేపు ఇది మాత్రమే కాకుండా నిర్జల ఏకాదశి కూడా కిడం గమనార్హం. అమ్మవారిని లక్ష్మీ, సరస్వతి, కాళికా దేవికి ప్రతిరూపమని అంటారు. సకల వేదాలకు మూలమైన అమ్మవారిని వేదమాత అని కూడా అంటారు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ దేవుడు గాయత్రిని నాలుగు ముఖాలతో ప్రార్ధించాడట. ఆపై నాలుగు వేదాల రూపంలో గాయత్రీ మంత్రాన్ని వివరించాడు. ముఖ్యంగా విద్యార్థులతో పాటు ఆధ్యాత్మిక వేత్తలకు గాయత్రీ జయంతి ఎంతో ముఖ్యమైనది. రోజుకు కనీసం ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వచ్చే ఫలితమే వేరట.

గాయత్రీ జయంతి రోజున ఏం చేయాలంటే.. విద్యార్థులు నియమానుసారం ఇవాళ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మేధో సంపత్తి పెరగడంతో పాటు చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ కాలంలో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. అలా ఇబ్బంది పడేవారు. గాయత్రీ జయంతి రోజు 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందట. అసలు మన మానసిక వేదనకు కారణమైన సమస్యలన్నీ దూరమవుతాయట. గాయత్రీ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే ఏపనిలో అయినా తప్పక విజయం సాధిస్తారట. వాక్ శుద్ధితో పాటు అఅపారమైన జ్ఞానాన్ని పొందుతామనట. ఇంతకీ గాయత్రీ మంత్రం ఏంటంటారా?

Share this post with your friends