హిందూ మతంలో దసరా పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరాను నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిందని చెబుతారు. కాబట్టి ఈ రోజును విజయ దశమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున మనం ప్రతి ఏటా దసరా పండుగను జరుపుకుంటూ ఉంటాం. అలాంటి దసరాను మనం రేపే జరుపుకోనున్నాం.
ఆశ్వ యుజ మాసం దశమి తిథి వచ్చేసి రేపు ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 9:08 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం దసరాను మనం రేపు జరుపుకోనున్నాం. ఇక రేపు మనం రెండు ముఖ్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఒకటి రావణ దహనం, రెండవది ఆయుధ పూజ. మరి ఆయుధ పూజకు శుభ సమయం ఎప్పుడంటే.. రేపు మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 గంటల వరకూ నిర్వహించవచ్చు. రావణ దహనం ప్రదోష కాలంలోే నిర్వహిస్తాం కాబట్టి అక్టోబర్ 12న రావణ దహనం శుభ సమయం సాయంత్రం 5:53 నుంచి 7:27 వరకు ఉంటుంది.