ఇవాళ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతిలో కొలువైన శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంటే మే 15న తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్రహ‌ణం, సేనాధిప‌తి ఉత్సవ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
మే 16న ధ్వజారోహణం జరగనుంది. మే 16వ తేదీ గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు..

16-05-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం

17-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం

18-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం

19-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం

20-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం

21-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం

22-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం

23-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం

24-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం

Share this post with your friends