నేడు స్కంద పంచమి.. కుమారషష్టిని ఎన్ని రోజుల పాటు చేసుకుంటారంటే..

తెలుగు ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహమై ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టకపోయినా , జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడు అంటే…. కుమారషష్టి రోజే. కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఆ రోజుని కుమారషష్టి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్టి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం. కుమారషష్టిని ఒక్కరోజు కాదు.. రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కంద పంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది.

Share this post with your friends