ఇవాళ శ్రావణ శనివారం.. నేడు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

శ్రావణ మాసం హిందువులకు చాలా పవిత్రమైనది. శ్రావణ మాసం అనేది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ నెలలో శివుడిని పూజిస్తే చాలా మంచిదట. ఈ మాసంలో నెల మొత్తం ఏవో ఒక పూజలు, వ్రతాలు ఉంటూనే ఉంటాయి. వాటిలో వర మహాలక్ష్మీ వ్రతానికి మహిళలు మరింత ప్రాధాన్యమిస్తారు. శ్రావణ మాసంలో చాలా శుభకార్యాలు, కొత్త పనులను నిర్వి హిస్తూ ఉంటారు. ఇవాళ శ్రావణ శనివారం. మరి ఈ రోజున ఏం చేస్తే మంచిదో తెలుసా? వాస్తవానికి శ్రావణం అనేది విష్ణుదేవుడి నక్షత్రం. ఈ మాసంలో విష్ణుమూర్తని సేవించుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

విష్ణుమూర్తికి ఇష్టమైన పులిహోర, లడ్డూ ప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో విష్ణు మూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని, అర్థష్టమ, సాడేసాతి శని ప్రభావం వంటివి తొలిగి పనులన్నింటిలోనూ విజయం లభిస్తుంది. ఇక ఇవాళ ముఖ్యంగా శనివారం గోమాతను పూజిస్తే చాలా మంచిదట. అలాగే అన్నదానం, వస్త్ర దానం, నవ ధాన్యాల దానం చేస్తే ఎంతో మంచిదట. ఇక ఇవాళ ఇనుముతో పాటు ఉప్పు, కొత్త చెప్పులు, నూనె, నల్లని బట్టలు వంటి వాటిని పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకూడదట.

Share this post with your friends