ఇవాళ గంగా దసరా.. దీని ప్రాముఖ్యత ఏంటంటే..

గంగా దేవి శివుని ఝటాఝూటాన్ని వదిలి నేలకు వచ్చిన రోజును గంగా దసరాగా భావిస్తారు. గంగా దసరా పండుగ రోజున స్వర్గం నుంచి గంగాదేవి శరవేగంగా భూమి మీదకు దూసుకు వస్తోందట. అప్పుడు శివుడు గంగమ్మ వేగాన్ని నియంత్రించేందుకు తన శిగలో బంధించి ఆపై ఆమె వేగాన్ని తగ్గించి భూమిపైకి విడిచాడట. తద్వారా శివుడు భగీరథుడి చేసిన తపస్సును మెచ్చి తపః ఫలాలను ఇచ్చాడని చెబుతారు. అయితే ఈ సారి వచ్చే గంగా దసరా 100 ఏళ్ల తర్వాత వస్తోందట. దీనికి కారణం హస్తా నక్షత్రంలో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం అనే శుభ యోగాలు ఇవాళ ఏర్పడుతుండటమే. ఈ రోజున చేసే నదీ స్నానం చేస్తే.. మోక్షంతో పాటు మనసు స్వచ్ఛత, మోక్షం, పుణ్యాన్ని పొందేందుకు మార్గం సుగమం అవుతుందట.

ఇక గంగా దసరా రోజున పూజ ఎలా నిర్వహించాలి? అంటే.. బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచి గంగా నదిలో స్నానం చేయాలి. ఒకవేళ గంగా నదికి వెళ్లలేని వారు.. మనం స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొంచెం కలుపుకున్నా గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందట. ఆ తర్వాత గంగామాత విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి, పుష్పాలను సమర్పించి, గంగా స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఇవాళ చేసే దాన ధర్మాలకు సైతం విశేష ఫలితం ఉంటుందట. ఈ రోజున నీరు, ధాన్యాలు, వస్త్రాలు , డబ్బును అవసరమైన వారికి దానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొంది జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం.

Share this post with your friends