
చైనీయుల వాస్తు శాస్త్రాన్ని కొంత వరకూ మనం కూడా నమ్ముతాం. అందుకే మన ఇంట లాఫింగ్ బుద్దాను పెట్టుకుంటూ ఉంటాం. చైనీయులు ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తారు. దాని ప్రకారం మన ఇంట ఐదు వస్తువులు ఉంటే లక్ష్మీదేవి తప్పక మన ఇంట్లోనే ఉంటుందట. పైగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పుష్కలంగా ఉంటుందట. మరి ఆ ఐదు వస్తువులేంటో చూద్దాం.
లాఫింగ్ బుద్దా : లాఫింగ్ బుద్దాను మీ ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా ఇల్లు చాలా బాగుంటుందట. దీనిని ప్రధాన ద్వారం ముందు పెట్టాలట. అలా పెడితే ఇంట్లోకి అడుగు పెట్టిన వారి కళ్లు ముందు దానిపై పడతాయి. దీంతో దిష్టి దోషాలున్నా తొలగిపోయి ఆనందం, అదృష్టం, ఆర్థిక లాభం తెస్తుందని నమ్మకం.
తాబేలు : తాబేలును విష్ణు స్వరూపంగా చూస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మావతారం ఒకటని చెబుతారు. తాబేలును ఇంటి ఉత్తరం వైపున ఉంచితే ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదట. తాబేలు ఇంట ఉంటే లక్ష్మీదేవి మన ఇంటనే ఉంటుందని నమ్మకం.
చైనీస్ నాణేలు : చైనీస్ నాణేలను ఎర్రటి గుడ్డలో చుట్టి సురక్షితంగా ఇంట్లో వేలాడదీయడమో లేదంటే పూజ గదిలో పెట్టడమో చేస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి సంపద లభిస్తుందట.
అక్వేరియం : అక్వేరియం ఉంటే ఆర్థిక ఇబ్బందులనేవి ఇంట్లో ఉండవని చెబుతారు. అలాగే ఏ ఫిష్‌ను అక్వేరియంలో పెట్టాలో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా గోల్డ్ ఫిష్ ఇంట్లో పెడితే ఆర్థికంగా చాలా బాగుంటుందట.
మనీ ప్లాంట్ : ఈ మొక్కను పిలవడమే కుబేర మొక్కగా పిలుస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి రావడంతో పాటు ఇంట పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. పైగా ఈ మొక్క ఆక్సిజన్‌ను అందిస్తుంది.
