నరదిష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయట. దిష్టి ప్రభావం అంతలా ఉంటుందట. నర దిష్టి తగిలితే కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుందట. ముఖ్యంగా నరదిష్టికి ఉన్న పవర్ అంత గట్టిగా ఉంటుంది. కంటి దృష్టి పడితే అంతే సంగతులు. కనీసం జీవితంలో ఎదుగుదలే ఉండదట. మరి నరదిష్టి మనపై, మన కుటుంబంపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నర దిష్టి, కన్ను దిష్టి నుంచి తప్పించుకోవాలంటే ”ఓం తత్పురుషాయ విఘ్న హే.. వక్రతుండాయ ధీమహి.. తన్నోన్ గణపతి ప్రచోదయాత్..” మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపిస్తూ ఉంటే మంచి జరుగుతుందట.
ఇలా నిత్యం మంత్రాన్ని జపించడం వలన మీపై, మీ ఇంటిపై పడే నర, కన్ను దిష్టులు తొలగిపోతాయని చెబుతారు. ఇది మాత్రమే కాకుండా మరో పని చేసినా నరదిష్టి తగలదట. అదేంటంటే.. కను దిష్టి తగలకుండా దిష్టి యంత్రాన్ని ఇంటి బయట కానీ.. లేదంటే వ్యాపార ప్రదేశంలో కానీ గోడపై ఉత్తర దిశ చూసే విధంగా పెట్టాలి. అలాగే పూజ గది లేదంటే మీ ఇంటికి వచ్చే వారి దృష్టిని ఆకర్షించేలా సైతం దిష్టి యంత్రాన్ని పెట్టాలి. అలా చేస్తే చాలు నర, కన్ను దిష్టి అనేది మనల్ని కానీ.. మన ఇంటిని కానీ టచ్ కూడా చేయదని చెబుతారు.