నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో నిన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు బాలయోగం, 10:30 గంటలకు ప్రబోధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు స్వామివారి కల్యాణం జరగనుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. కాగా.. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీన ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం 9 గంటలకు అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గరుడ ముద్ద, సాయంత్రం 7 గంటలకు భేరీ పూజ, దేవతావాహనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 18న ముగియనున్నాయి. 18న మహాపూర్ణాహుతి, చక్రస్నానంతోబ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ముగింపు పలకనున్నారు. ఈ ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం నిర్మించారు. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాయకాయక స్వామిని దర్శించుకున్న అప్పల దేశికుడు అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని తలపించే విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మాణం గావించారు. కాకతీయుల కాలంలో వింజూరు వంశానికి చెందిన నరసింహాచార్యుల వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారట. అనంతరం అటువంటి ప్రతిమనే శ్రీపురం గ్రామంలో ప్రతిష్టించారని కూడా ప్రచారం జరుగుతోంది.