
రెండోళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ. సమ్మక్క సారక్క జాతరకు దేశంలోనే అతి పెద్ద జాతర. అయితే మినీ జాతరకు సైతం భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అది ఈ నెల 12, 13, 14, 15 తేదీలలో జరుగనుంది. సమ్మక్క, సారక్క మినీ మేడారం జాతర నిర్వహించడానికి ఆదివాసి పూజారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. వారం రోజుల ముందుగానే ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం ఈ జాతర నిర్వహణ కోసం పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయాలన్నీ శుద్ధి చేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.
మేడారంతో పాటు కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలో, కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుగొండ్లని పగిడిద్దరాజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుడిమెలికి ఆదివాసీ ఆచార సంప్రదాయ పూజను సమ్మక్క పూజారులు బయ్యక్కపేటలోనూ నిర్వహించారు. ఘట్టమగుట్ట వద్ద ఎదురుపిల్ల వేడుకను నాయకపోడు పూజారులు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను పొలిమేర దేవతలకు అంకురార్పణ చేశారు. అదే విధంగా బయ్యక్కపేటలో సమ్మక్క పూజారులు గుడిమెలికి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహించారు.. మరో వైపు నాయకపోడు పూజారులు ఘట్టమగుట్ట వద్ద ఎదురుపిల్ల వేడుక నిర్వహించారు.. అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలకు అంకురార్పణ చేశారు.
