బోనాల వేడుకకు ముహూర్తం ఫిక్స్..

హైదరాబాద్‌లో జులై 7 నుంచి బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఆషాఢ మాసంలో జరగనున్న ఈ వేడుకల్లో నగరం మొత్తం పాల్గొంటుంది. ఒక్కొక్క ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. తొలి బోనం గోల్కొండలోని జగదాంబికా గుడిలో సమర్పించడంతో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. భక్తులు అమ్మవారికి అలంకరించిన కుండల్లో నైవేద్యం పెడతారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాలు మూడు దశలలో జరుగుతాయి. వాటిని గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి బోనాలు అని పిలుస్తారు.

సికింద్రాబాద్ తరువాతి వారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇలా నెల మొత్తం ప్రతి గురు, ఆదివారాల్లో నగరమంతా బోనాల ఉత్సవాలను జరుపుకుంటుంది. చివరి ఆదివారం నగరంలో మిగిలిపోయిన అన్ని ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హరీబౌలిలో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి గుడి, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి గుడిలో జరిగే ఉత్సవాలతో బోనాలు ముగుస్తాయి. 150 ఏళ్ల క్రితం కలరా మహమ్మారి వ్యాపించింది. అప్పుడు మహంకాళి అమ్మవారికి మొక్కితే కలరా మొత్తం పోయిందట. అప్పటి నుంచి జంట నగర వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా నడుస్తోంది.

Share this post with your friends