తిరుమలలో భక్తులకు తిలక ధారణ ప్రారంభం

తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామల రావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవకులు తిరుమలలోని ఏటిసి, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, విక్యూసి 1, 2 ల వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని.. కాబట్టి భక్తులు తిలక ధారణ చేయించుకోవాలని సూచించారు.

ఇక డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా శ్యామలరావు భక్తుల సందేహాలు, సలహాలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాఢ వీధుల్లో చెప్పుల్లేకుండా తిరిగేలా చూడాలని.. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఓ భక్తులు కోరాడు. దీనికి సమాధానంగా.. మాఢ వీథలలో విజిలెన్స్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అన్న ప్రసాదం కాంప్లెక్స్ లో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీవారి సేవకులకు హాల్ నెంబర్- 4 లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఇక తిలక ధారణ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, పిఆర్ఓ (ఎఫ్ ఏసి) కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends