నూతన సంవత్సరంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంభందించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు.. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల అవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. దీంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు. ఆదివారం తర్వాత నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఇక మంగళవారం 64359 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 20711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీ మలయప్ప స్వామివారికి హుండి ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.