
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ మాసంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. నేటి ఉదయం 10 గంటలకు అక్టోబర్ మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు అక్టోబర్ మాసం గదుల కోటాను ఆన్లైన్ లో విడుదల చేయనుంది. కాబట్టి భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు గదులను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో ఇద్దరు భక్తులను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్ కార్డులతో సుప్రరభాత సేవకు వెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లక్కీడిప్ ద్వారా సుప్రభాత సేవ టికెట్లను సదరు భక్తులు పొందినట్టుగా గుర్తించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు మలయప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమలేశుడిని 73,332 భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది.
