అలా బ్రహ్మ పదార్థం పూరి జగన్నాథుడి చెంతకు చేరిందట..

శ్రీకృష్ణ పరమాత్ముని హృదయం పూరికి ఎలా చేరిందో తెలుసుకున్నాం కదా. ఆ తరువాత కథ కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడిపై జర అనే బోయవాడు బాణం సంధించాడని చెప్పుకున్నాం కదా. అతను విశ్వభసు అనే పేరుతో పూరి నగరంలో జన్మించాడు. శ్రీకృష్ణుడి హృదయం ఈ విశ్వభసుకే దొరుకుతుంది. దానిని తమ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి జాగ్రత్తగా భద్రపరిచి నిత్యం పూజిస్తూ ఉండేవాడు. మరోవైపు ఇంద్రద్యుమ్న రాజు.. తన వల్లనే జగన్నాథుడి విగ్రహం సగంలో ఆగిపోయిందని కలత చెందుతూ ఉంటాడు. ఆయనకు బ్రహ్మ పదార్థం విశ్వభసు వద్ద ఉందని తెలుస్తుంది. వెంటనే దానిని జగన్నాధుడి విగ్రహాల చెంతకు చేర్చాలని భావిస్తాడు. విశ్వభసు అడిగిన వెంటనే ఇవ్వడు కాబట్టి.. అతని కూతురుని పెళ్లాడమంటూ అనుచరుడిని పంపిస్తాడు.

విశ్వభసు కూతురితో వివాహానంతరం అల్లుడి కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. ఈ విషయాన్ని ఇంద్రద్యుమ్నుడికి అనుచరుడు చెప్పడంతో తనకు ఆ గుహ చూపించాలంటూ విశ్వభసును ఆదేశిస్తాడు. రాజాజ్ఞ కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఇంద్రద్యుమ్నుడిని గుహ వద్దకు విశ్వభసు తీసుకెళతాడు. కానీ బ్రహ్మ పదార్థం విశ్వభసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడికి కేవలం విశ్వభసు మాత్రమే బ్రహ్మ పదార్థాన్ని చూడగలడని.. అతనే తన చెంతకు దానిని చేరుస్తాడని చెబుతాడు. అలా విశ్వభసు పూరి జగన్నాథుడి ఆలయానికి బ్రహ్మ పదార్థాన్ని చేరుస్తాడు. ప్రతి పన్నెండెళ్లకోసారి నవకళేవరోత్సవం అంటే పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను పెట్టే సమయంలో ఒక వృద్ధుడి కళ్లకు గంతలు కట్టి అతని ఒల్లంతా పట్టు వస్త్రాలు చుట్టి ఆలయంలోకి పంపిస్తాడు. అతను పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు.

Share this post with your friends