ఇవాళ శివయ్య మూడు రూపాలను పూజించాలట..

శ్రావణ మాసంలో ప్రతిరోజూ చాలా ముఖ్యమైనది. ఏరోజున పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ నెలలో ముఖ్యంగా శివ పార్వతులతో పాటు విష్ణుమూర్తి, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఇక శ్రావణ సోమవారం అయితే శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఇవాళ ఉపవాసం ఉండి శివయ్యకు అభిషేకం నిర్వహిస్తే మన కోరిక ఏదైనా నెరవేరుతుందట. అలాగే ఈ రోజున చేసే ఉపవాసంతో శివయ్య అనుగ్రహాన్ని పొందుతామట. ఇవాళ ప్రదోష కాలంలో శివుని మూడు రూపాలను పూజించుకుంటే మన కోరిక తప్పక నెరవేరుతుందట.

పంచాంగం ప్రకారం అయితే ఉపవాసం ఎప్పుడు ఉంటారో తెలుసా? శ్రావణ సోమవారం శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఆ లెక్కన ఇవాళే సప్తమి తిథి.ఉదయం 04:23 నుంచి 05:06 వరకూ ఇవాళ బ్రహ్మ ముహూర్తం.. అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:52 వరకూ ఉంటుంది. ఇక ఈ సమయంలో శివయ్యను ఏ ఏ రూపాల్లో పూజించాలో తెలుసా? నీలకంఠుడు, నటరాజ స్వామి, మహా మృత్యుంజయ స్వరూపం అనే మూడు రూపాల్లో పూజిస్తే చాలా మంచి జరుగుతుందట. కాబట్టి ఈ రోజున ఈ మూడు రూపాల్లో శివయ్యను పూజించుకున్న వారికి ఏ విషయంలోనూ అపజయం ఉండదట.

Share this post with your friends