జ్యోతిర్లింగ దర్శనం చేయాలనుకుంటున్న వారు ఇదొక్క సారి చూడండి..

ఐఆర్‌సీటీసీ భక్తుల కోసం సప్త జ్యోతిర్లింగ యాత్రను చేపట్టింది. ఈ యాత్ర కోసం భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ యాత్ర ఈ ఏడాది ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 26 వరకూ కొనసాగనుంది. అంటే యాత్ర మొత్తం 11 రాత్రులు / 12 రోజుల పాటు జరగనుంది. ఈ యాత్రలో భాగంగా.. ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్], ద్వారక [నాగేశ్వర్], సోమనాథ్ [సోమనాథ్], పూణే [భీమశంకర్], నాసిక్ [త్రయంబకేశ్వర్], ఔరంగాబాద్ [గ్రీశ్నేశ్వర్] ఆలయాల దర్శనం చేయిస్తారు. ఇక భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు.. ఆగస్ట్ 17న విజయవాడ నుంచి బయలుదేరుతుంది. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్, కామారెడ్డి, నిజాంబాద్, ధర్మబడ్, మద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ప్రయాణం సాగుతుంది. ఈ ప్రాంతాల్లోని వారు జ్యోతిర్లింగ దర్శనం కోసం బుక్ చేసుకోవచ్చు.

ఇక ఈ టూర్‌లో భాగంగా యాత్రికులకు ఉదయం అల్పాహారంతో పాటు టీ లేదంటే కాఫీ అందిస్తారు. ఇక మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్‌తో పాటు టీ లేదంటే కాఫీ అందిస్తారు. ఇక రాత్రివేళ అల్పాహారం అందిస్తారు. రైలులోనే ప్యాంట్రీ కార్‌లో ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేసి అందిస్తారు. క్షేత్ర సందర్శన సమయాల్లో ఏర్పాటు చేసే బసలో భాగంగా స్లీపర్ క్లాస్ వారికి నాన్ ఏసీ రూములు.. ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఏర్పాటు చేస్తారరు. ఇద్దరు లేదంటే ముగ్గురికి కలిపి ఒక గదిని ఇస్తారు.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..

టికెట్‌ ధర విషయానికి వస్తే ఒకరికి సెకండ్ ఏసీ అయితే.. రూ.43,355/-, థర్డ్ ఏసీ రూ. 33,015/-, స్లీపర్ రూ. 20,590/- గా ఉంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలతో పాటు టికెట్ బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG28 సంప్రదించండి. మరింత సమాచారం కోసం 9281495843, 9281495845 నంబర్స్ ను సంప్రదించండి.

Share this post with your friends