ఇంట వాస్తు దోషం ఉన్నవారు ఈ మొక్కను నాటండి..

ఇంటి నిర్మాణం పక్కాగా వాస్తు శాస్త్ర ప్రకారం ఉండాలి. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించి తీరాల్సిందే. అలాగే వస్తువులు, మొక్కలు ఏ దిశలో పెంచాలో కూడా తెలుసుకోవాలి. కొన్ని మొక్కలను ఇంట నాటడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది నిమ్మ మొక్క. కానీ దీనిని పెంచుకునే విషయంలోనూ నిబంధనలు పాటించాల్సిందే. నిమ్మ చెట్టు ఇంట ఉంటే మంచిది కదాని ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. తప్పు దిశలో పెంచితే ప్రయోజనం లేకపోగా హాని జరుగుతుంది.

నిమ్మ చెట్లను ఇంటికి ఎడమ వైపునా లేదా కుడి వైపులా నాటాలా అనే విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి. సరైన దిశలో నాటితేనే ఆర్థిక శ్రేయస్సు ఉంటుందట. నిమ్మ చెట్లు వాస్తు పరంగానే కాకుండా ఔషధ గుణాలు ఎక్కువగా కలిగిన మొక్క. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెబుతారు. నిమ్మ పండ్లనే కాకుండా ఆకులను ఆయుర్వేదంలో వినియోగిస్తారు. నిమ్మ చెట్టు చెడు దృష్టితో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. జాతకంలో శని గ్రహ దుష్ప్రభావాలతో బాధపడేవారు సైతం నిమ్మచెట్టును నాటితే మంచిదట. శని ప్రభావాన్నే కాకుండా రాహు, కేతువుల ప్రభావాన్ని తగ్గించడంలో నిమ్మ చెట్టు కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. జాతక దోషం ఉన్నవారు సైతం క్రమం తప్పకుండా నిమ్మచెట్టుకు నీరు పోస్తే ఉపశమనం లభిస్తుంది.

Share this post with your friends