మరికొన్ని గంటల్లో దేశమంతా శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. శ్రీరాముడు జన్మించిన చైత్ర శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేవాలయాలలో రామచరితమానస్‌ను , సుందరాకాండను పారాయణం చేస్తారు. ఇవి పఠించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అలాగే వివాహం కావడం లేదని చింతించే వారు ఈ రోజున కొన్ని పనులు చేయడం వలన వివాహానికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ నెల 6న మనం శ్రీరామనవమిని జరుపుకోనున్నాం.
ఎవరికైనా వివాహంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే.. శ్రీ రామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు, గంధం, కుంకుమను సమర్పిస్తే వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం, రామ నవమి రోజున రామ దర్బార్‌ను పూజించి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించండి. వ్యాధుల నుంచి బయటపడాలంటే ఈ రోజున హనుమంతుడిని పూజించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో కొబ్బరికాయ చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఆ తరువాత ఓం నమ:శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉందని నమ్మకం.