మన ఇంట్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ చెట్టేనట..

మొక్కలను, జంతువులను పూజించడం హిందూ సంప్రదాయంలో భాగమే. ముఖ్యంగా మనుషులు జాతక దోషాల కారణంగా వివిద రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి పరిష్కారంగా చెట్లను పూజిస్తే ఫలితం బాగుంటుందని పండితులు చెబుతారు. శని దోషాలతో పాటు ఇతర సమస్యల నివారణకు చెట్లను పూజిస్తే ఫలితం ఉంటుందట. అలాగే వాస్తు దోషాలను సైతం తొలగించే శక్తి చెట్లకు ఉందని చెబుతారు. అసలు వాస్తు దోషం తొలగించే శక్తి ఏ చెట్టుకు ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంట్లో జమ్మి చెట్టు ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొనడంతో పాటు ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. జమ్మి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినదట. కాబట్టి శని దోషాలు కూడా తొలగిపోతాయట. జమ్మి చెట్టు ఇంటి ప్రధాన ద్వారానికి కుడి వైపున ఉంటే చాలా మంచిదట. ఒకవేళ ప్రధాన ద్వారం వద్ద జమ్మి చెట్టును నాటేందుకు సరిపడా స్థలం లేకుంటే మేడ మీద దక్షిణం వైపు జమ్మి చెట్టును నాటితే సకల శుభాలను ఇస్తుందట. వీలైతే జమ్మి చెట్టును విజయదశమి నాడు లేదంటే శనివారం నాడు నాటితే ఫలితం చాలా బాగుంటుందట.

Share this post with your friends