హిందూమతంలో పౌర్ణమి, అమావాస్యలను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ ఏడాది శ్రావణ మాసం చివరి రోజైన అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఇది మరెప్పుడో కాదు.. సెప్టెంబర్ 2వ తేదీన రానుంది. అమావాస్యలన్నింటిలోకి దీనిని విశిష్టమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రోజున నదీ స్నానం చేసినా.. దాన ధర్మాలు చేసినా చాలా మంచిదట. శివునికి ఇష్టమైన సోమవారం నాడు అమావాస్య వస్తోంది కాబట్టి ఆ రోజున శివయ్యను ఆరాధిస్తే మంచిదట. ఆ రోజున 108 సార్లు తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తే మనకు బ్యాడ్ డేస్ పోయి మంచి రోజులు వస్తాయట.
సోమవతి అమావాస్య రోజున ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, ఓం కారం జపించడం వలన కూడా మనకు మంచి జరుగుతుందట. ఇక ఈ రోజున ఉదయాన్నే నదీస్నానమాచరించి శివుడిని పూజించాలట. ఈసారి వచ్చే సోమవతి అమావాస్యకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున రెండు పెద్ద యోగాలు సైతం సోమవతి అమావాస్యకు యాడ్ అవనున్నాయి. వాటిలో ఒకటి శివయోగం కాగా.. రెండవది సిద్ధియోగం. ఈ యోగ సమయంలో చేయాల్సిన పనేంటంటే.. మన పూర్వీకులను స్మరించుకుని దానం చేయాలట. ఇలా చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.