ఈ సారి ధన త్రయోదశి ప్రత్యేకతేంటంటే..

దీపావళికి ముందు ధన త్రయోదశి వస్తుందని తెలిసిందే. అయితే ఈ ఏడాది ధన త్రయోదశి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ధన త్రయోదశి నాడు చాలా అరుదైన యోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ధన త్రయోదశి రోజున త్రిగ్రాహి యోగం, త్రిపుష్కర యోగం, ఇంద్ర యోగం, లక్ష్మీ నారాయణ యోగం, శష మహాపురుష రాజ్యయోగం, ధాత యోగం, సౌమ్య యోగం వంటి ఏడు రకాల శుభ యోగాల కలయిక జరగబోతోంది. కాబట్టి ఈ ఏడాది ధన త్రయోదశి వందేళ్ల తరువాత వస్తున్న అత్యంత ప్రత్యేకమైనదట.ఈ యాదృచ్చికాలన్నీ వందేళ్ల తర్వాత సంభవిస్తున్నాయట.

ఇవన్నీ కలగలిసి ఈ ఏడాది ధన త్రయోదశిని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ప్రాముఖ్యత మరింత పెరిగింది. బుధుడు వృశ్చికరాశిలో సంచరించడం వల్ల ఈ రాశిలో బుధ, శుక్ర గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక ధన లక్ష్మీ యోగం లేదా లక్ష్మీ నారాయణ యోగాన్ని సూచిస్తుంది. ఇది అత్యంత ప్రయోజనకరమైన యోగం. ఈ రెండు రాశుల కలయిక వలన జాతక దోషాలు తొలగిపోవడమే కాకుండా మనిషి జీవితంలో చాలా ప్రయోజనాలు కలుగుతాయట. అలాగే ధనానికి ఎలాంటి లోటూ ఉండదట.

Share this post with your friends