బాలిని దుష్ట ఆత్మల నుంచి ఈ ఆలయమే రక్షిస్తుందట..

బాలిలోని తనోహ్ లాట్ దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. హిందూ మహా సముద్రంలోని రాతిపై దీనిని నిర్మించారు. తీరం నుంచి కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న రాతిపై మూడు ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించడం జరిగింది. భూమి సముద్రం రెండూ కలిసి దైవిక శక్తిగా ఏర్పడిందనేది ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయం చుట్టూ సముద్రం ఉండటంతో అలల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలలతో మెట్లన్నీ నీటితో మునిగిపోతూ మనం ఆలయానికి వెళ్లగానే మెట్ల మార్గం కనిపించదు. కాసేపు ఆగి అల వెళ్లిపోతే కానీ మనకు ఆలయ మెట్లు కనిపిస్తాయి.

బాలి ద్వీపం తీర ప్రాంతం చుట్టూ ఏడు సముద్ర దేవాలయాలు సముద్ర దేవతలకు అంకితం చేయబడ్డాయి. ఆ ఏడు దేవాలయాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. బాలిని దుష్ట సముద్ర ఆత్మల నుంచి ఈ ఆలయాలే రక్షిస్తాయని అక్కడి వారి నమ్మకం. 16వ శతాబ్దంలో భగవాన్ డాంగ్ హయాంగ్ నిరర్థ అనే బ్రాహ్మణుడు జావా నుంచి బాలిలో హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చాడట. అతను తబానన్‌లోని ఒక గ్రామంలోని ప్రజలతో కలిసి ప్రార్థనలు చేసేవాడట. ఇలా ప్రార్థనలు చేస్తూ తనాహ్ లాట్ దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధించడానికి ఇదే సరైన ప్రదేశమని భావించాడట. ఆ తరువాత ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని భగవాన్ డాంగ్ హయాంగ్ నిరర్థ చెప్పాడట.

Share this post with your friends