ఈ ఆలయం సహజ సౌందర్యానికే కాదు.. మరో అద్భుతమేంటంటే..

భారతదేశంలో ప్రతి గ్రామానికీ ఓ దేవాలయం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున దేవాలయాలున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌ను దేవతల భూమి అని పిలుస్తారు. ఇక్కడ పుణ్యక్షేత్రాలకు కొదువ లేదు. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఓ పురాతన దేవాలయంలో ఉంది. ఆ దేవాలయంలో ఉన్న నీటి వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆ నీటి వలన ప్రజల ఆరోగ్యాలు పూర్తిగా నయమవుతాయని ప్రతీతి. అసలు ఆ ఆలయంలో ఎవరు కొలువై ఉన్నారు? ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.

ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉంది. నైనిటాల్‌లో పాషన్ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధి చెందినదే కాదు.. పురాతన దేవాలయం. ఈ ఆలయం భక్తులకు వరాలిచ్చే కల్పవల్లి వంటిది. నైని సరస్సు ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. నైనిటాల్ సందర్శించే భక్తులకు, పర్యాటకులకు ఈ ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయ సహజ సౌందర్యం చూస్తే మైమరచిపోతారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఇక్కడి నీటికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోని నీటి వలన ఎలాంటి చర్మ సమస్యలున్నా తప్పక నయమవుతాయని ప్రతీతి.

Share this post with your friends