ఈ ఆలయం చూడటానికి సాధారణంగా ఉంటుంది కానీ.. విశిష్టతలు మాత్రం..

కొన్ని ఆలయాలు చూడటానికి చాలా చిన్నగాననూ.. సింపుల్‌గానూ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటి విశిష్టతలు తెలుసుకుంటే కళ్లు గిర్రున తిరుగుతాయి. అందుకే గుడిని చూసి భగవంతుడిని అంచనా వేయకూడదు. ఆయన లీలలు అపారం. అలాంటి ఆలయాల్లో ఒకటే భోగేశ్వరాలయం. వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో ఉంది. అలాగే ఈ ఈశ్వరుడిని ఒక పాము ప్రతిరోజూ రాత్రిపూట వచ్చి సేవించేదట. భోగి చేత సేవించబడిన ఆలయం కాబట్టి ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు వచ్చింది.

ఈ ఆలయం చూడటానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. విశిష్టతల విషయానికి వస్తే కోకొల్లలు. ఇక్కడ శివలింగం కింద లింగం, మళ్ళీ దాని కింద మరో లింగం… అలా మొత్తంగా 11 లింగాలు ఉన్నాయట. అయితే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు. మరో విశేషం ఏంటంటే ఈ అభిషేక ప్రియుడికి ఎన్ని బిందెల నీళ్లతో అభిషేకం చేసినా కూడా చుక్క నీరు కూడా బయటకు పోదు. ఎక్కడికి వెళుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయానికి వాస్తు దోషం కూడా ఉందంటారు. ఆలయ ప్రవేశ ద్వారం ఈశాన్యంలోనూ.. స్వామి వారు ఉత్తర ముఖంగా గానూ.. నైరుతిలో బావి వంటివి ఉన్నాయి. ఇవన్నీ శాస్త్ర విరుద్ధమని వాస్తు పండితులు చెబుతారు.

Share this post with your friends