అర్జనుడి పక్కన శ్రీకృష్ణుడు ఎందుకుంటాడు? అనే దానికి ఈ కథే నిదర్శనం..

ఒకరోజు శ్రీ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు ‘అవును కృష్ణా.. అది పావురమే’ అన్నాడు. మరికాసేపటికి కృష్ణుడు మళ్ళీ అబ్బే.. అది పావురం కాదు.. గద్దలా ఉంది చూడు అన్నాడు. అవును నిజమే అది పావురం కాదు.. అది గ్రద్దనే కృష్ణా అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్లీ కాసేపటికి ఇలా అన్నాడు. ‘అర్జునా.. అది గద్ధ కానే కాదు.. అది చిలుక సరిగ్గా చూడు’ అన్నాడు. నిజమే కృష్ణా.. అది చిలుకే అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని కృష్ణుడు.. ‘అయ్యో.. అది చిలుక కూడా కానే కాదు.

అది కాకి అర్జునా.. ఒక్కసారి పరికించి చూడు’ అన్నాడు. ఆ వెంటనే అర్జనుడు.. ‘అరే.. నిజమే అది చిలుక కాదు.. కాకే కృష్ణా’ అని అన్నాడు. అప్పుడు కాస్త కోపంగా అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు. ‘అసలు నీకు బుద్ధి ఉందా..? నీకంటూ ఒక అభిప్రాయం లేదా..? సొంతంగా ఆలోచించలేవా..? నేను ఏదంటే అదే అని వంత పాడుతున్నావు’ అన్నాడు. దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ఓ సర్వాంతర్యామీ! నేను నిన్నే నమ్ముకుని బతుకుతున్నాను… నువ్వు ఏదంటే నేనూ అదే..! మీరు పావురమే కదా అన్నారు… నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది… నాకు అన్నీ మీరే… మీ మాటే నాకు వేదం కృష్ణా’ అన్నాడు. ఈ నమ్మకమే అర్జునుడి పక్కన భగవంతుడిని ఉండేలా చేసింది.

Share this post with your friends