ఈ శివుడు తనంతట తానే కదులుతాడు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే..

ఆలయంలో దాదాపు శివుడు లింగరూపంలోనే ఉంటాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. శివలింగాలన్నీ దాదాపుగా నలుపు రంగులోనే ఉంటాయి. ఇది కూడా ఎందుకు అనే ఆలోచన రాదు. అసలు శివలింగం అంటే అర్థం ఏంటో తెలుసా? శివం అంటే శుభప్రదం అని, లింగం అంటే సంకేతమని అర్థం. అయితే కొన్ని శివలింగాలు చాలా ప్రత్యేకం అనిపిస్తాయి. అలాంటివి అరుదుగా వింటూ.. చూస్తూ ఉంటాం. వాటిలో ఒకటి కదిలే శివలింగం. శివలింగం కదులుతుందా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇంతకీ అదెక్కడుందంటారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దియోరియా జిల్లాలోని రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది.

“దుగ్దేశ్వరనాథ్”గా ఇక్కడ శివుడు పూజలందుకుంటున్నాడు. ఈ శివలింగాన్ని మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగం అని కూడా చెబుతుంటారు. మనకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే.. ఇక్కడి దేవాలయంలో శివలింగం ఏకధాటిగా 24 గంటల పాటు అయినా కదులుతుంది. కానీ మనం కదిపితే మాత్రం ఇంచ్ కూడా కదలదు. ఈ ఆలయానికి 2 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సాధారణంగా శివలింగాన్ని పానవట్టంపై ప్రతిష్టిస్తారు. కానీ దుగ్గేశ్వరనాథ్‌ని మాత్రం నేతల మీద ప్రతిష్టించారు. ఇక ఈ శివలింగం కదలడం ఆరంభిస్తే ఎంతసేపైనా కదులుతుందని పూజారులు చెబుతున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ శివలింగం ఎంత లోతు ఉంటుందనేది తెలుసుకోవడానికి ఎంతమంది యత్నించినా అంతం మాత్రం కనుక్కోలేకపోయారట. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఈ కదిలే శివలింగాన్ని చూడడానికి వస్తారు. కదిలే శివలింగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share this post with your friends