ఈ వినాయకుడు ఆపద్భాంధవుడట.. ఎంతటి కష్టాన్నైనా దూరం చేస్తాడట..

ప్రతి ఒక్క ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శించుకుంటే చాలు.. మనసులోకి కోరిక ఇట్టే తీరుతుంది. ప్రతి క్షేత్రానికి ఓ మహిమ ఉంటుంది. ఓ వినాయకుడు ఆపద్భాంధవుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఆ వినాయకుడు ఎక్కడుంటాడంటే.. మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రంలో ఉంటాడు. ఈ క్షేత్ర సముదాయంలో భాగంగా మూడవ క్షేత్రంలో బల్లాలేశ్వర్ పేరుతో కొలవబడుతూ ఉంటాడు. ఈ క్షేతంలోని వినాయకుడే ఆపద్భాంధవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ స్వామిని దర్శిస్తే ఎంతటి కష్టమైనా, ఎలాంటి ఆపద అయినా ఇట్టే తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయ చరిత్ర ఈ నాటిది కాదు.. 400 ఏళ్ల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని 1640లో మోరేశ్వర్ విఠల్ సింద్కర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణం ‘శ్రీ’ అనే అక్షరం ఆకారంలో జరిగింది. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఉదయాన్నే సూర్యుని కిరణాలు నేరుగా గణపతి విగ్రహంపై ప్రసరిస్తూ ఉంటాయి. రాతి సింహాసనంపై ఆసీనుడైన విఘ్నేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ ుంటాడు. ఇక ఈ క్షేత్రం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో రోహా నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న పాలీ అనే గ్రామంలో ఉంది. ఈ పాలి గ్రామం సరస్‌గడ్ కోట, అంబా నదికి మధ్యలో ఉంది.

Share this post with your friends