అరుణాచలంలో నిజంగా జరిగిన విషయం ఇదే..

అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు తప్పక తెలుసుకోవలసిన కధ ఇది. అక్కడ ఆలయం లోపలకి వెళ్లేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం ఉంటుంది, చాలా మహత్యం, శక్తివంతమైనది. అక్కడే అరుణగిరి నాధుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. అరుణగిరి నాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమభట్టు అని పిలిచేవారు. యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా ఆయన తిరిగే వాడట.చెడు వ్యసనాలకు బానిసై, తీవ్ర రోగగ్రస్తుడైన గౌడ డిండిమభట్టును కుటుంబం వెలివేసిందట.

ఒకసారి ఆయన తీవ్ర విచారంలో ఉన్న సమయంలో.. ఒక సాధువు దైవ ప్రార్థన చేసుకో.. ఆయన కృపకు ప్రాతుడివిగా అని చెప్పాడు. అలా చెప్పినది సాక్షాత్తూ అరుణాచలేశ్వరుడంటారు. ఆయన తీవ్రంగా ప్రార్థించినా ఫలితం లేకుంటే, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తర గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని కిందకి దూకాడు. అప్పుడు కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకుని కిందకు దించి నాలుకపై షడక్షరిని లిఖించి, తన ప్రశస్తిని గానం చేసి తరించమన్నాడు. అపుడు తన నోటి నుంచి ఆశువుగా వచ్చిన కీర్తనే ఈ ముత్తై తరు పతి. అది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెల. ఇది అరుణాచలేశ్వరాలయంలో ఉంది. ఇప్పటికి అరుణాచలం వెళ్ళినపుడు లోపలి వెళుతుండగా ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దర్శించవచ్చును.

Share this post with your friends