
ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతని దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఎలా తిండి సంపాదించాలా అని ఆలోచిస్తూనే చివరికి ఒక దుకాణం వద్ద ఇత్తడి దీపం కనిపించింది. “ఒక రూపాయి మాత్రమే” అని రాసి ఉంది. అది చూసి ఆశ్చర్యంతో “ఎందుకు ఇంత తక్కువ డబ్బుకి అమ్ముతున్నావు?” అని అడిగాడు. అప్పుడు షాపువాడు.. “ఇది అద్భుత దీపం బాబూ! ఇందులో ఒక భూతం ఉంటుంది. నువ్వు చెప్పిన కోరిక తీరుస్తుంది. కానీ ఒక షరతు ఉంది. ఈ భూతం ఎప్పుడూ పనిలోనే ఉండాలి. పనిలేకపోతే, ఇస్తున్న వరాలు తిరిగి తీసుకుపోతుంది” అని చెప్పాడు.
పేదవాడు వెంటనే దీపం కొనుక్కొని ఇంటికి వచ్చాడు. రుద్దగానే భూతం ప్రత్యక్షమైంది. “ఏమి కావాలి నీకు?” అని అడిగింది. ఆకలిగా ఉన్నవాడు భోజనం అడిగాడు. క్షణాల్లో పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి. తర్వాత మంచం అడిగాడు. హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. తర్వాత ఇల్లు అడిగాడు. రాజభవనం లాంటి ఇల్లు వచ్చింది. భూతం ఏమి కావాలి నీకు?” అని అడుగుతూనే ఉంది. అతను కూడా చెబుతూనే ఉన్నాడు. కానీ చివరికి విసిగిపోయాడు. ఎంతవరకు అడగగలడు? అడగకపోతే, దానికి పని లేక సంపదలు పోతాయి. అప్పుడు అతడు ఏం చేశాడు? మరో కథనంలో తెలుసుకుందాం.
