అర్జనుడు తన జెండాపై హనుమంతుడిని నిలుపుకోవడానికి కారణమిదే..

హనుమంతుడికి, అర్జనుడికి మధ్య జరిగిన సవాల్‌లో అర్జనుడు ఓటమి పాలయ్యాడు. అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడని తెలుసుకున్నాం కదా. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. జరిగిన విషయం ఇద్దరి అడిగి తెలుసుకున్నాడు. న్యాయనిర్ణేత లేకుండా నిర్వహించిన పోటీ చెల్లదు కాబట్టి మళ్ళీ పోటీ మొదలు పెడితే తాను పక్షపాతం లేకుండా సాక్షిగా వ్యవహరించి తీర్పు చెబుతానని తెలిపాడు. ఈసారి అర్జనుడు మనసులో శ్రీకృష్ణుడిని తలచుకుని వంతెన నిర్మాణం గావించాడు.

ఈసారి హనుమంతుడిని తట్టుకుని వంతెన నిలిచింది. దీంతో హనుమంతుడు కుప్పగంతులేశాడు. అయినా సరే వంతెనకు ఏమీ కాలేదు. అది చూసిన అర్జనుడు, హనుమంతుడికి ఏదో మాయ జరిగిందని అర్థమైంది. వెంటనే తమ ముందున్నది ఎవరన్నది ఇద్దరూ గ్రహించారు. అప్పుడు ఇద్దరిలో అహంకారం తొలగిపోయింది. వారి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. తాను శ్రీరామావతారంలో ఉన్నప్పుడు తనను సేవించిన హనుమను, కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడినీ స్నేహబంధం తో కలిపాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత బలవంతుడైన ఆంజనేయుడిని తన జెండాపై నిలుపుకున్నాడు.

Share this post with your friends