ఇదేం విచిత్రం.. పది రోజుల్లోనే బాబా బర్ఫానీ మాయమయ్యారు..

అమర్‌నాథ్ యాత్ర కోసం దేశ విదేశాల్లోని హిందువులంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఈ యాత్రను పూర్తి చేస్తారు. శివుని మంచు శివలింగమైన బాబా బర్ఫానీని దర్శించుకోగానే తమ కష్టమంతా తీరిపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. అలాంటిది అక్కడకు వెళ్లాక బాబా బర్ఫానీ కనిపించకపోతే? ఎక్కడ లేని నిరాశ ఎదురువతుంది. ప్రస్తుతం అదే జరగనుంది. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోపే మంచు శివలింగ బాబా బర్ఫానీ కరిగిపోయింది. జూన్ 29న ఈ యాత్ర ప్రారంభవగా.. జూలై 6 నుంచే బాబా బర్ఫానీ అదృశ్యమయ్యారంటూ వార్తలు వినవస్తున్నాయి. దీనికి కారణం ఎండల వేడి అని అంటున్నారు.

అమర్‌నాథ్ గుహలో మంచు శివలింగం సహజశిద్ధంగా ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. పార్వతీదేవికి శివుడు ఇక్కడే అమరత్వాన్ని బోధించాడని చెబుతారు. కాబట్టి ఇక్కడి మంచు శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు భావిస్తూ ఉంటాయి. గుహలోని నీరు గడ్డకట్టడంతో ఏర్పడిన శివలింగ పరిమాణం చంద్రకళల ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో ఎండలు పెరిగాయి. తద్వారా వేడి పెరిగింది. ఈ క్రమంలోనే కశ్మీర్‌లో సాధారణం కంటే 7.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా అంటే గరిష్ట ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలుగా నమోదైంది. దీంతో బాబా బర్ఫానీ కరిగిపోయారని గుహ పూజారులు చెబుతున్నారు.

Share this post with your friends