ఓ గుహలో విద్యుద్దీప వెలుగులో మాత్రమే ఈ అమ్మవారిని దర్శించుకోవాలట…

దట్టమైన నల్లమల అడవుల్లోని ఇష్టకామేశ్వరి దేవి గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇక్కడికి వెళ్లేందుకు సరైన దారి ఉండదు. ఈ అమ్మవారిని దర్శించుకోవడమనేది ఒక సాహసోపేతమైన యాత్ర. దట్టమైన అటవీ మార్గంలో ఉండే ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకోడానికి కొండల మీదుగా అనేక బండరాళ్లను దాటుకుంటూవెళ్లాల్సి ఉంటుంది. ఆప్రాంతంలో ప్రయాణించే కొన్ని జీపుల వారికి మాతరమే అది సాధ్యం. ఎంతో భయపడుతూ ప్రయాణం చేస్తాం. కానీ ఆ భయమంతా అమ్మవారిని చూడగానే ఎగిరిపోతుంది. అప్పట్లో అంటే జీపులు కూడా లేనిసమయంలో అమ్మవారిని అడవుల్లోని సిద్ధులు పూజించేవారట.

ఇక ఇక్కడి ఇష్టకామేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో శివలింగాన్ని, రుద్రాక్షమాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమ్మవారు ఓ గుహలో ఉంటుంది. అక్కడ విద్యుద్దీపాలు ఏమీ ఉండవు. కేవలం దీపపు వెలుగులో మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ప్రశాంతమైన ఈ ఆలయ పరిసరాలు మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటాయి. అక్కడి పరిసరాలు చూడగానే చాలా మంది అక్కడ ధ్యానంలో కూర్చుండిపోతారు. ఇక అమ్మవారికి ఇక్కడి అడవుల్లో నివసించే చెంచులు నిత్య పూజలు చేస్తుంటారు.

Share this post with your friends