ఈ అమ్మవారు భక్తులతో మాట్లాడి కోరికలు నెరవేరుస్తుందట..

భారతదేశంలో ఎన్నో ప్రాధాన్యతగాంచిన దేవాలయాలున్నాయి. కొన్ని అయితే మిస్టీరియస్ ఆలయాలున్నాయి. ఎందరు యత్నించినా కూడా ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. గుడి గోపురం నీడ పడని ఆలయం, అమ్మవారికి చెమట పట్టడం, అమ్మవారికి పిరియడ్స్ రావడం వంటి ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అలాంటి అద్బుత దేవాలయాల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఒకటి ఉంది. అమ్మవారు తన భక్తులతో మాట్లాడి సమస్యలన్నింటినీ తొలగిస్తుందని నమ్మకం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమట. ఇదెలా సాధ్యమా? అని పరిశోధనలు చేసిన వారికి కూడా ఇప్పటి వరకూ ఫలితం దక్కలేదు.

అమ్మవారు భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తొలగించే ఆలయం మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని పృథ్వీపూర్ తహసీల్ ప్రాంతంలోని గ్రామ పంచాయితీ మడియాలో ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారిని అచ్రు మాత అని భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్న వారికి తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో అమ్మవారిని దర్వఇంచుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు అచ్రు మాతను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయంలోని అచ్రుమాత భక్తులతో మాట్లాడి వారి సమస్యలు, కోరికలు తెలుసుకుని నెరవేస్తుందట.

Share this post with your friends