ఈ వినాయకుడు మరింత స్పెషల్.. స్లిమ్‌గా.. అశ్వత్థామగా..

వినాయక చవితి కోసం వినాయకులను ఎంచుకోవడానికి మునుపే కాస్త వెరైటీగా.. ఇతరులు ఎంచుకునే దానికి భిన్నంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. దీని కోసం ముందుగానే విగ్రహ తయారీ దారులు ట్రెండ్‌కు తగినట్టుగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలన్నింటిలో ప్రధాన పాత్రలకు సంబంధించిన వినాయక విగ్రహాలను తయారు చేశారు. సలార్, దేవర, పుష్ప, టీ20 ప్రపంచకప్ వినాయక విగ్రహాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే అన్నింటిలోకి మరింత స్పెషల్ వచ్చేసి.. కల్కి వినాయకుడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

మూవీ మాత్రమే కాదు.. కల్కిలోని పాత్రలు సైతం జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అశ్వత్థామ పాత్ర అమితంగా ఆకట్టుకుంది. ఆ పాత్రలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ జీవించారు. స్లిమ్‌గా కనిపిస్తూ అమితాబ్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక కల్కి సినిమాను పోలిన ఓ వినాయక మందిరాన్ని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా డెంకన్ కొట్టాయి అనే ఊళ్లో వేశారు. కల్కి సెట్ నుంచి లోపలికి వెళితే వినాయకుడు మనకు అశ్వత్థామ గెటప్‌లో దర్శనమిస్తాడు. ఈ వినాయకుడు విపరీతంగా జనాలను ఆకట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Share this post with your friends