ఈ గణపతి దేవాలయం మీనార్లతో మసీదులా కనిపిస్తుంది.. కారణమేంటంటే..

మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రంలో ఉండే మయూర గణపతి ఆలయ నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చూసేందుకు నాలుగు మీనార్‌లతో మసీదును తలపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. బహమనీయుల కాలంలో తురుష్క చక్రవర్తులు ఎక్కడ ఆలయాలు కనిపించినా వాటిని ధ్వంసం చేసి వాటిలోని సంపదను దోచుకెళ్లేవారు. బహమనీయుల దాడుల నుంచి గణేశుడి ఆలయాన్ని ఎంతో సంతోషించి వినాయకుకాపాడేందుకు అప్పట్లో ఈ విధంగా నిర్మాణం జరిపారట. మయూర గణపతి ఆలయంలోని స్వామివారిని మోర్ వినాయకుడని కూడా పిలుస్తారు.

హిందీలో మోర్ అంటే నెమటి కాబట్టి.. ఇక్కడి వినాయకుడు నెమలిపై కనిపిస్తాడు కాబట్టి మోర్ వినాయకుడని పిలుస్తారు. ఈ వినాయకుడిని పూర్వం పాండవులు దర్శించుకుని పూజలు నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది. అయితే ప్రస్తుతం వేరొక విగ్రహం ఉంది. పాండవులు పూజించిన విగ్రహం కూడా ఇప్పటి విగ్రహం వెనుక ఉంటుంది. వినాయక చవితి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఒక్క సమయంలోనే కాదు.. విజయదశమికి సైతం ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుని భక్తితో పూజలు నిర్వహించిన వారికి కార్యసిద్ధి, శత్రుజయం తప్పక ఉంటాయని చెబుతారు.

Share this post with your friends