అష్టమి తిథి మంచిది కాదంటారు.. కానీ ఎంత మంచిదో తెలిస్తే..

మంగళవారం అష్టమి తిథి రావడం చాలా అరుదు. మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంటుంది. కానీ ‘అష్టమి వ్యాధి నాశిని’గా పేర్కొంటారు. అంటే ఈ అష్టమి తిథినాడు అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించినా.. ఔషధాన్ని సేవించినా సత్వర ఫలితం కలుగుతుందని చరక సంహిత చెబుతోంది. మరి అష్టమినాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం. నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం, అవే అష్ట భార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అంటారు.

ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా, వారంతా హరీ అన్నారు. ఒక్క అష్టమి అనే కాదు, ప్రతీ తిథీ మంచిదే. అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది,మనం అర్థం చేసుకుని ఆచరించాల్సిందీ ఇదే. కష్టాలను తొలగించే అష్టమి శివ పురాణం ప్రకారం, అష్టమి రోజు కాలభైరవుడిని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి. ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహం లేదా పఠం ఎదుట దీపం వెలిగించాలి.

Share this post with your friends