ఇవి కానీ అనుకోకుండా మీ ఇంటికి వచ్చాయో.. అదృష్టమే అదృష్టం

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క వస్తువు, జంతువు, పక్షులు తదితర ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పక్షుల రాక శుభప్రదంగానూ.. మరికొన్ని పక్షుల రాక అశుభంగానూ భావిస్తారు. ఉదాహరణకు ఇంటి దగ్గర కాకి కనిపిస్తే అతిథులు వస్తారని చెబుతారు. దీనికి సంబంధించి పురాణ గాధ కూడా ఉంది. ఇక గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే శాంతి, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్ముతారు. కొందరు గుడ్లగూబ రాకను అశుభంగా భావిస్తారు. ఇది పూర్తిగా నమ్మకాలు, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. అసలు వాస్తు పరంగా ఏ పక్షి ఇంట్లోకి వస్తే అదృష్టం మన ఇంటిని వెదుక్కుంటూ వస్తుందో తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లోకి రామచిలుక ఇంట్లోకి వచ్చి రాగాలు తీసిందో అదృష్టం తన్నుకుంటూ వస్తుందట. వ్యాపారం చేసే వారైతే ఇది వ్యాపార వృద్ధికి సూచన అట. అంతేకాదు ఇంట్లో ఉన్నవారి మనసు రిఫ్రెష్ అయి ఆనందంగా ఉంటారు. అలాగే ఎక్కడి నుంచైనా నెమలి వచ్చినా కూడా చాలా మంచిదట. కార్తికేయుడి వాహనమైన నెమలి ఇంట్లోకి వస్తే ఆ ఇంట సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోనున్నాయని సంకేతమట. ఇంట్లో నల్ల చీమలు ఉండటం కూడా చాలా మంచిదట. ఆర్థిక పరంగా కలిసొస్తుందట. అలాగే ఆ ఇంటివారెవరైనా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే తప్పక విజయం సాధిస్తారు. ఎలాంటి పని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారట.

Share this post with your friends