శంఖం ఇంట్లో ఉంటే పాటించాల్సిన నియమాలివే..

హిందూ మతంలో శంఖానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దేవుని గదిలో దీనిని కూడా పెడతారు. ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శంఖాన్ని ఊదితే మంచి జరుగుతుందనేది హిందువుల భావన. ఆలయంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అయితే శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. శంఖాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందట. శంఖం అన్ని దేవుళ్ళు, దేవతలకు ఆవాసంగా చెబుతారు. కాబట్టి శంఖం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

శంఖం ఊదినప్పుడు దాని శబ్దం ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం వరకూ వాతావరణం పవిత్రంగా మారుతుందట. శంఖాన్ని పూజ గదిలో ఈశాన్య మూలలో ఉంచాలి. అలాగే శంఖం నోరు పైకి చూసేలా ఉంచాలి. దీనికి కారణంగా శంఖం నుండి సానుకూల శక్తి వెలువడుతూనే ఉండటమే. ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసి పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతుంది. శంఖాన్ని ఊదడానికి ముందు.. ఉపయోగించిన తర్వాత దానిని గంగా జలంతో శుభ్రం చేయాలి. శంఖాన్ని పెట్టే స్థలం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లో శంఖం ఉంటే తప్పనిసరిగా ఈ నియమాలైతే పాటించండి.

Share this post with your friends