వినాయకుడి నిమజ్జనానికి విధి విధానాలేంటంటే..

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయకచవితిని నిర్వహించుకున్నాం. ఇక ఆ రోజున ప్రతిష్టించుకున్న వినాయకుడు వాస్తవానికి పది రోజుల పాటు పూజించి ఆ తరువాత అనంత చతుర్దశి రోజున వినాయకుడి విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు. అయితే అన్ని రోజుల పాటు పూజలు నిర్వహించలేని వారు మాత్రం మూడవ రోజున లేదంటే ఐదవ రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే వినాయకుడి నిమజ్జనం ఎలా పడితే అలా చేయకూడదు. కొన్ని విధి విధానాలు తప్పక ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

గణపతి నిమజ్జనానికి ముందు ఒక చెక్క ఆసనాన్ని సిద్ధం చేసి దానిని గంగాజలంతో శుద్ధి చేసి స్వస్తిక్ గుర్తు వేయాలి. అనంతరం పీటంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచి కొత్త బట్టలు ధరింప జేసి, కుంకుమతో తిలకం దిద్ది ఆసనంపై అక్షతను ఉంచి గణేశ విగ్రహానికి పూలు, పండ్లు, మోదకం మొదలైన వాటిని సమర్పించాలి. ఆ తరువాత వినాయకుడిని పూజించి తిరిగి మళ్లీ రావాలని కోరుకుని హారతి ఇచ్చి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఇక ఐదవ రోజున నిమజన్జనం చేయాలనుకున్నవారు సెప్టెంబర్ 11న చేయాల్సి ఉంటుంది. శుభ సమయం వచ్చేసి ఉదయం 10.45 నుంచి 12.18 మధ్య నిర్వహించవచ్చు. నిమజ్జనానికి నలుపు లేదంటే నీలం రంగు దుస్తులను ధరించకూడదు.

Share this post with your friends