ఆ వీడియోలో నిజం లేదు.. తప్పుడు వార్తలను నమ్మకండి: టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానంలోని వసతి గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చోటుండదు. ముందుగా అలిపిరి నుంచే చెకింగ్ ప్రారంభమవుతుంది. అక్కడ అంతూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే కొండపైకి పంపిస్తారు. అలాంటి తరుణంలో మద్యం, మాంసం వంటి వాటిని కొండపైకి తీసుకెళ్లడానికి ఆస్కారముండదు. ఒకవేళ తీసుకెళ్లినా కూడా విజిలెన్స్ వారు పట్టేస్తారు. పట్టేశారంటే పెద్ద ఎత్తున రచ్చ అవుతుంది. అలాగే తిరుమలలో ఎలాంటి విందులకు, చిందులకు స్థానముండదు. కానీ తిరుమల వేంకటేశ్వరుడిని కూడా రాజకీయ లబ్దికి వాడేస్తున్నారు. తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలు, వీడియో బాగా వైరల్ అవుతున్నాయి.

అవేంటంటే.. సాలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమలలోని పద్మావతి వసతి గృహంలో చిందులు వేస్తున్నారని.. అక్కడి అధికారులు ఏం చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తిరుమలలో అపచారం పేరిట వైరల్ అవుతున్న వార్త అవాస్తమని తేల్చింది. అసలు సామాజిక మాద్యమంలో వైరల్ అవుతున్న సదరు వీడియో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వీడియో కాదని తేల్చింది. అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది.

Share this post with your friends