
జ్వాలా ముఖి శక్తి పీఠం గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే దాని విశేషాలు చాలా మందికి తెలిసే ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఆధ్యాత్మిక జ్వాలలు వెలుగులు విరజిమ్మే జ్వాలాముఖి శక్తిపీఠం ఉంది. ఇక్కడ దేవి సతి మాత గళం (జిహ్వా) పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇక్కడి అమ్మవారిని జ్వాలాదేవిగా పూజిస్తారు. జ్వాలాముఖి శక్తి పీఠం ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్వాలా ముఖి శక్తి పీఠం ప్రత్యేకతేంటంటే..
ఈ ఆలయంలో మంటలు వెలిగించడానికి ఎటువంటి నూనె, గింజలు లేదా వత్తులు అవసరం లేదు. భూగర్భం నుంచి స్వయంగా జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఈ జ్వాలలు వందల ఏళ్లుగా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతున్నాయి. జ్వాలలను దివ్యరూపంగా అమ్మవారి సాక్షాత్కారంగా భావిస్తారు. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో లేరు. పర్వత గర్భం నుంచి వెలువడే నవరత్న జ్వాలలునే దేవి సాక్షాత్కారమని నమ్ముతారు. అందుకే జ్వాలాముఖిని “జీవ జ్యోతి” అని పిలుస్తారు.
