హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. ఆ రోజున అదొక్కటే విశేషం కాదు.. అరుదైన యోగం మరొకటి ఏర్పడనుంది. అదేంటంటే.. బ్లూ మూన్. ఇది ఆకాశంలో కనిపించనుంది. రక్షాబంధన్ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అదృష్ట్ కలిసి రానుందట. అదేంటో చూద్దాం. రాఖీ పండుగ రోజున బ్లూ మూన్ ఏర్పడనుంది. బ్లూ మూన్ అంటే ఏంటంటే.. చంద్రుడు భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్ అంటారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ స్థిత కంటే పెద్దగానూ ప్రకాశవంతంగానూ కనిపిస్తాడు.
ఒక నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా పిలుస్తాం. బ్లూమూన్ వచ్చిన సమయంలో చంద్రుడు తన సహజ రంగులోనే కనిపిస్తాడు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే చంద్రుడు పెద్దగా.. ప్రకాశవంతంగా కనిపిస్తాడు. రాఖీ పండుగ రోజున చంద్రోదయం మనకు సాయంత్రం 6:56 గంటలకు బ్లూమూన్ సంభవిస్తుంది. ఇక రాత్రి 11:55 గంటలకు చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అదే రోజు చంద్రుడు మకరరాశి నుంచి బయలుదేరి సాయంత్రం 6:59 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.